నెల్లూరు రూరల్: సిపిఎం మహాసభలు ప్రారంభం

58చూసినవారు
నెల్లూరు రూరల్: సిపిఎం మహాసభలు ప్రారంభం
నెల్లూరు రూరల్ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో శుక్రవారం సిపిఎం రూరల్ మండలం మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు ముత్యాల నాగయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, పొట్టే పాలెం చంద్రమౌళి అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భవిష్యత్తు ప్రజా పోరాటాలకు ఈ మహాసభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్