మనుబోలు: బద్దెవోలులో ఘనంగా గ్రామ దేవతకు పూజలు
మనుబోలు మండలం బద్దేవోలు గ్రామంలో గ్రామ దేవత శ్రీ బద్దేవోలమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. పూజల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పొంగలి నైవేద్యంగా పెట్టి, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.