వరికుంటపాడులో గర్భిణీలకు వైద్య పరీక్షలు

62చూసినవారు
వరికుంటపాడులో గర్భిణీలకు వైద్య పరీక్షలు
వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణీలు ప్రభుత్వ వైద్యశాలలోనే కాన్పులు చేయించుకోవాలని మండల వైద్యాధికారిని కరిష్మా సూచించారు. ఆమె సోమవారం ఆస్పత్రిలో 14మంది గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. గర్భవతులు కాన్పు అయ్యేంతవరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్