ఉదయగిరి నియోజకవర్గం లో అన్ని మండలాల అధికారులు లబ్ధిదారుల గడప వద్దనే పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలో ని అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. కూటమి నాయకులందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.