జోగి రమేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవు: కొనకళ్ల
AP: నూజివీడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ కీలక నేత జోగి రమేష్ పాల్గొనడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పందించారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడూ చేయనని తెలిపారు. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తారని తనకు తెలియదని.. ఆయనతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును కలిసి పూర్తి వివరాలను చెబుతానన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలకు ఆయన ఖండించారు.