![పెనుగొలను లో దోమలు నివారణకు చర్యలు పెనుగొలను లో దోమలు నివారణకు చర్యలు](https://media.getlokalapp.com/cache/87/90/8790f0ff37a95428cfc35d972d5bcbf4.webp)
పెనుగొలను లో దోమలు నివారణకు చర్యలు
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం దోమలు నివారణకు చర్యలు తీసుకున్నారు. మురికి కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమ లార్వా పెరగకుండా చర్యలు తీసుకున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రిక తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుల్తానా పరిశుభ్రత గురించి, అంటువ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.