తిరువూరులో స్వామి హుండీ ఆదాయం లక్ష

67చూసినవారు
తిరువూరులో స్వామి హుండీ ఆదాయం లక్ష
తిరువూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకలను లెక్కించారు. 7 నెలలకు గాను హుండీ ఆదాయం రూ 1, 16, 284 లు వచ్చినట్లు మేనేజర్ వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమములో పుట్రెల మారమ్మ వారి దేవస్థాన కార్య నిర్వహణ అధికారి వై. సీతారామయ్య పర్యవేక్షణలో రామలింగేశ్వర ఆలయ చైర్మన్ తిరుమల శెట్టి వేణుబాబు ఆలయాల ధర్మకర్తలు ఐవికె. కిషోర్, బొప్పన సాంబశివరావు ధారా లావణ్య, అర్చకులు భవాని రాధాకృష్ణ శాస్త్రి, కె. శ్రీ రామచంద్ర మూర్తి భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్