వైభవంగా ప్రారంభమైన ఆలయ వార్షికోత్సవం

65చూసినవారు
వైభవంగా ప్రారంభమైన ఆలయ వార్షికోత్సవం
గంపలగూడెం మండలం పెనుగొలను లో గురువారం మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ లక్ష్మి ఉప్పలమ్మ ఆలయము 9వ వార్షికోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ వ్యవస్థాపకులు కొండేటి నారాయణస్వామి, నాగమణి దంపతులు ఆధ్వర్యంలో శ్రీ గణపతి పూజ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త బృందం చే హనుమన్ చాలీసా పారాయ ణం చేశారు. రేపు శుక్రవారం రెండో రోజు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.