విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కూటమి బృందం కోరనుంది.