మాచవరంలోని విత్తన దుకాణాలను సత్తెనపల్లి ఏడీఏ మస్తానమ్మ మంగళవారం పరిశీలించారు. సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్ లేకుండా దుకాణదారులు విత్తనాలు అమ్మకాలు జరపరాదని ఆమె సూచించారు. అనుమతి పత్రాలు లేకుండా నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపితే 1983 చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులకు కూడా విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు.