రోగికి మత్తుమందు ఇచ్చి.. డాక్టర్ అత్యాచారం
పశ్చిమ బెంగాల్లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్కతా పోలీసులు ఓ డాక్టర్ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు.