విత్తనాల కొరత లేకుండా చూడండి: డీఏవో

65చూసినవారు
విత్తనాల కొరత లేకుండా చూడండి: డీఏవో
రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాల సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో వివిధ ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారని అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్