సైకో పాలన అంతం చేయడానికి సిద్దంగా ఉండండి : కన్నా

558చూసినవారు
సైకో పాలన అంతం చేయడానికి సిద్దంగా ఉండండి : కన్నా
నకరికల్లు మండలం చల్లగుండ్లలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కన్నా కు దారి పొడవునా అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. భారీ క్రేన్ తో పూల మాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ సైకో పాలన అంతం చేయడానికి ప్రజలు అందరూ సిద్దంగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో తనని సత్తెనపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తీ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్