రాష్ట్రానికి పట్టిన శని పోతుంది

66చూసినవారు
రాష్ట్రానికి పట్టిన శని పోతుంది
ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని 10 రోజుల్లో పోతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, రానున్న ఐదేళ్లు, తర్వాతి తరాల భవిష్యత్‌ను ఈ ఎన్నికలే నిర్ణయించబోతున్నాయన్నారు. శుక్రవారం నాదెండ్ల మండలం గణపవరంలో లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలంతా బటన్లు నొక్కి జగన్‌రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌ను ఖాళీ చేయించే సమయం మే 13 అని, ఐదేళ్ల భవిష్యత్తు కోసం ఈ పది రోజులు కష్టపడాలని,రాబోయే ఐదేళ్లు యువత, రైతుకు భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలన్నీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్