అయిదేళ్లుగా అడ్డుఅదుపూ లేని దోపిడీతో జగన్‌రెడ్డి ముఠా మింగిన ప్రతిపైసా కక్కించి తీరతామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. అవినీతి తేలేంతవరకూ తాడేపల్లి నుంచి బయటకు దారి తీసే ప్రతిమార్గంలో పోలీసులు నిశితంగా నిఘా పెట్టాలని కోరారు. అక్రమాలకు పాల్పడ్డ ఎవరిని వదిలిపెట్టమని ఆయన అన్నారు.