ఈనెల 6న వినుకొండ లోని ఎసీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు ఐదు కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసుగల నిరుద్యోగులు అర్హులన్నారు. తమ బయోడేటా, ఆధార్ తదితర జిరాక్సులు తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.