కురుపాం మండలం బియ్యాలవలస పంచాయతీ దుర్బిలి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించే విధానంపై మంగళవారం అవగాహన కల్పించారు. అలాగే పొలం గట్టులపై అంతర పంటగా అపరాలను పండించుకోవచ్చని, వివిధ రకాల కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారుచేసే విధానాన్ని రైతులకు వివరించారు. సిబ్బంది ఎన్ఎఫ్ఎ శోభ, మోడల్ మేకర్ బుజ్జారావు, ఐసీఆర్పిసీ సభ్యులు పాల్గొన్నారు.