గుమ్మలక్ష్మీపురం మండలం పెదమేరంగి కూడలి వద్ద రహదారి మరమ్మతులు చేపట్టాలని సీపీఎం నాయకుడు జీవన్న అన్నారు. ఈ మేరకు గురువారం రహదారి పై నిరసన తెలియజేశారు. రోడ్డుపై గోతులు ఏర్పడడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాదని, మరమ్మలు చేపట్టే వరకు నిరసన తెలుపుతామన్నారు.