అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

79చూసినవారు
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
పాలకొండ బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. విద్యుత్ పరికరాల వినియోగం, విలువైన కాగితాలను భద్రపరుచుట, ప్రమాదాల నివారణకు ఉపయోగించే కార్బన్ డయాక్సైడ్ విషర్ వినియోగాన్ని వివరించారు. ప్రమాదం సంభవిస్తే 08941 260111 నంబర్ను సంప్రదించాలని సూచించారు. బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్