శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పాలకొండ సబ్ జైలును శనివారం సందర్శించారు. ముద్దాయిలతో మాట్లాడి బెయిల్ మంజూరు గురించి అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిల సెల్లు, వంటగది, టాయిలెట్స్ ను పరిశీలించారు. భోజన ఏర్పాట్ల గురించి ఆరాతీశారు. జైలు సిబ్బందికి తగు సూచనలు చేశారు. జూనియర్ సివిల్ జడ్జి విజయ్ రాజకుమార్, న్యాయవాదులు రామ్మోహన్, వెంకటేశ్వర్రావు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.