మన రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తాం: భట్టి
తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావస్తున్న తరుణంలో వరంగల్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తామని అన్నారు. 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక చేశామని చెప్పారు. వరంగల్ కు రూ.6000 కోట్లనిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం, 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని చెప్పారు. గత BRS ప్రభుత్వం మహిళా సాధికారతను నిర్లక్ష్యం చేసిందన్నారు.