సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఏపీ జి ఈ ఏ జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ కోరారు. బుధవారం విజయనగరం ఏపీ జి ఈ ఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యా వైద్య శాఖలలో యాప్స్ పనిబరాన్ని తగ్గించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఖాళీలను అనుసరించి పదోన్నతులు కల్పించాలని, డి ఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి బాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.