తణుకులో రైతులను ఏడిపించిన వైసీపీ మంత్రులపై మండిపడ్డ పవన్

71చూసినవారు
తణుకులో రైతులను ఏడిపించిన వైసీపీ మంత్రులపై మండిపడ్డ పవన్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో వైసీపీ మంత్రులపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. రైతులు ధాన్యంలో మొలకలు వచ్చాయని చింతిస్తుంటే ఇక్కడ మంత్రి బూతులు తిట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను బాధపెట్టిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని, జగన్ అహంకారం పోయే రోజులు వస్తాయని పవన్ అన్నారు. వైసీపీ మంత్రులు ఇక్కడ దోచుకున్న డబ్బుతో పక్క రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. ఐదు కోట్ల మంది ప్రజలకు మూడు పార్టీల బలం కావాలని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్