ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీల్లో సభ్యుల ఎంపికకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలు ఓటు వేయడంపై ఎన్డీయే కూటమి విప్‌లకు బాధ్యతలు అప్పగించింది.