తాడుపై వాగు దాటి విద్యుత్ పునరుద్ధరణ (వీడియో)

55చూసినవారు
అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది సాహసమే చేశారు. ఈదురుగాలులకు మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో నూరుపుడి గ్రామం వారం రోజులుగా అంథకారంలో ఉండిపోయింది. ఈ క్రమంలో జేఎల్‌ఎం రామయ్య, ఫ్రాంచైజీ వర్కర్ నీలన్న దొర సాహసోపేతంగా సన్నని తాడుపై వాగు దాటి వెళ్లి విద్యుత్‌ను పునరుద్ధరించారు. వారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్