Top 10 viral news 🔥
వారికి టెన్త్లో 10 మార్కులు వస్తే పాస్
పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన (ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మెంటల్ బిహేవియర్) విద్యార్థులకు పాస్ మార్కులను 10గా నిర్ణయించింది. గతంలో పాస్ మార్కులు 35 ఉండగా.. దాన్ని 10కి తగ్గించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని దేవానందరెడ్డి పేర్కొన్నారు.