మెఘా కంపెనీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
TG: గోదావరి ఫేజ్-2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేస్తూ బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఇంజినీరింగ్ విభాగం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుంది.