పొదిలిలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గ్రామోత్సవం

83చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని మెయిన్ రోడ్డు సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాయిబాబాను పురవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్