
ఒంగోలులో న్యాయ సేవాధికార సంస్థ సమావేశం
ఒంగోలులో సోమవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయస్థానంలోని బార్ అసోసియేషన్ హాల్ లో న్యాయవాదులకు, సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ సూచనలు సలహాలు ఇచ్చారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఇరువర్గాలను ఒప్పించవలసిన అంశాలపై మాట్లాడారు. రాజీ చేసుకోవడం వల్ల ఇరు వర్గాలు గెలిచినట్లేనని ఇరు వర్గాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయవాదులకు ఉందన్నారు.