కేటీఆర్ నివాసం దగ్గర ఉద్రిక్తత (వీడియో)
TG: HYDలోని ఓరియన్ విల్లాస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు లోనికి వెళ్లేందుకు యత్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా కేటీఆర్ ఇంట్లోకి ఎలా వెళతారని పోలీసులను బీఆర్ఎస్ వర్గాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మద్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. కాగా, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు నేపథ్యంలోనే పోలీసులు కేటీఆర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.