అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లి గ్రామంలో గురువారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఏం. ఎల్) మద్యం బాటిళ్లు, 10(650ఏం. ఎల్) బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని చెప్పారు.