ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో వేంచేసి ఉన్న గుంటి గంగమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎదుర్కొనకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.