జాతీయస్థాయి సెమినార్ కు తాళ్లూరు ఏవో ఎంపిక

71చూసినవారు
జాతీయస్థాయి సెమినార్ కు తాళ్లూరు ఏవో ఎంపిక
ఇతర దేశాలలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కావలసిన సర్టిఫికెట్, విధి విధానాలను అమలుపరిచేందుకు హైదరాబాద్ లో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్ కు తాళ్లూరు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావును ఎంపిక చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 11 నుండి 14వ తేదీ వరకు జరిగే సెమినార్ లో ఏవో పాల్గొననున్నారు. రాష్ట్రం నుండి తాళ్లూరు ఏవో ఎంపిక కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్