Mar 27, 2025, 11:03 IST/
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Mar 27, 2025, 11:03 IST
సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో సవాల్ విసిరారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ జరిగిందా? అని నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్లో ఎక్కడైనా నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రైతు బంధు ఆపింది రేవంత్రెడ్డి అని.. మళ్లీ మమ్మల్ని అంటున్నారని విమర్శించారు.