కొమరోలు మండలంలోని దద్దవాడ, తాటిచెర్ల, గోవిందుల పల్లి గ్రామాల పరిసర ప్రాంతాలలో శనివారం పిచ్చికుక్క హల్చల్ చేసింది. ఆరుగురు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజులగా ఈ ప్రాంతంలో పిచ్చికుక్క సంచరిస్తుందని కుక్కను బంధించి స్థానికులను కాపాడాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.