కనిగిరిలో ఘనంగా రంజాన్ వేడుకలు

62చూసినవారు
కనిగిరిలో గురువారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రేమ, శాంతికి చిహ్నం రంజాన్ పర్వదినమన్నారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్