మాజీ సీఎం జగన్ ను కలిసిన కదిరి బాబురావు

73చూసినవారు
మాజీ సీఎం జగన్ ను కలిసిన కదిరి బాబురావు
కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సోమవారం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో పార్టీ ఓటమికి గల కారణాలను గురించి వారిరువురు కాసేపుచర్చించారు. అనంతరం భవిష్యత్తులో అనుసరించాల్సిన విధివిధానాలపై మాజీ సీఎం జగన్ తో కదిరి బాబురావు చర్చించినట్లు ఆయన తెలిపారు.