పారిశుధ్యం పై అలసత్వం వహిస్తే సాహించేది లేదు

77చూసినవారు
పారిశుధ్యం పై అలసత్వం వహిస్తే సాహించేది లేదు
కనిగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో పారిశుధ్యం పై అలసత్వం వహిస్తే సాహించేదిలేదని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం 11వ వార్డు కాశిరెడ్డి నగర్ లో పర్యటించారు. ఈ ప్రాంతంలో కాలువలు లేక మురుగునీరు బయటకు వెళ్లే అవకాశం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని త్వరలో కాలువలు నిర్మించి పారిశుద్ధ్య లోపాన్ని సవరించేందుకు తగిన చర్యలు తీసుకొని ఆ ప్రాంతాభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్