నిర్ణీత సమయాల్లో మాత్రమే అన్ లోడ్: ఎస్సై

61చూసినవారు
నిర్ణీత సమయాల్లో మాత్రమే అన్ లోడ్: ఎస్సై
కనిగిరిలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎస్సై త్యాగరాజు సోమవారం పలునిబంధనలు పాటించాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు లారీల నుంచి సరుకు అన్ లోడ్ చేయడానికి వీల్లేదని అలాగే ట్రాలీఆటోలు, మినీ ట్రక్ లు ఉదయం 8 నుంచి 2 వరకు, సాయంత్ర 4 నుంచి 8 వరకు అన్ లోడ్ చేయరాదని తెలిపారు. చెప్పులబజారులో కర్రలు, పొగాకు, ట్రాక్టర్లు, లారీలు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు రాకపోకలు నిషేధం అని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్