ఓటు హక్కును ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని సింగరాయకొండ ఎస్సై శ్రీరామ్ బుధవారం అన్నారు. స్ధానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై మాట్లాడుతూ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాతు మంగళవారం నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.