ఆడపిల్లల ఆత్మ రక్షణకు తైక్వాండో విద్య చాలా అవసరమని కొండేపి ఎస్సై కృష్ణ బాజీబాబు అన్నారు. సోమవారం మండలంలోని కట్టావారిపాలెంలో స్వచ్చంద సంస్థ మన ఊరి వికాసం ఆధ్వర్యంలో జరిగిన తైక్వాండో వేసవి శిక్షణ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు, విద్యార్ధుల నైపుణ్యం మెరుగు పరచుటకు ఎన్నారైలు ధర్మవరపు ప్రసాదు, బెజవాడ వెంకట్ తదితరులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.