కొండేపి లోని పొగాకు వేలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసరి ధర రూ. 283. 01 పలికిందని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. వ్యాపారులు నేతివారిపాలెం, రామచంద్రపురం గ్రామాలకు చెందిన రైతులు 1, 222 బేళ్లు తీసుకురాగా అందులో 1141 బేళ్లు కొనుగోలయ్యాయి. వివిధ కారణాలతో వ్యాపారులు 81 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 330, కనిష్ట ధర రూ. 205, సరాసరి ధర రూ. 283. 01 పలికింది.