చంద్రబాబుతో దామచర్ల భేటీ మంత్రి పదవి ఖాయమేనా?

79చూసినవారు
చంద్రబాబుతో దామచర్ల భేటీ మంత్రి పదవి ఖాయమేనా?
టిడిపి అఖండ విజయం సాధించటంతో పాటు బుధవారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అమరావతిలో సోమవారం రాత్రి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో దామచర్లకు మంత్రి పదవి ఖాయమనే చర్చ మొదలైంది. పార్టీ కష్ట కాలంలోనూ వెన్నంటే నడిచిన దామచర్ల కుటుంబానికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీ క్యాడర్ భావిస్తుంది.

సంబంధిత పోస్ట్