మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలి

66చూసినవారు
మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో బుధవారం విద్యాశాఖ అధికారులు, ప్రఽధానోపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యాహ్న భోజనం అమలులో ఆహారపట్టికను పక్కాగా పాటించాలన్నారు. ఆ విషయంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్