విజయవాడకు రెండు జనరేటర్లు పంపిన ఎస్ఈ

79చూసినవారు
విజయవాడకు రెండు జనరేటర్లు పంపిన ఎస్ఈ
విజయవాడ వరద ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జిల్లా విద్యుత్ సిబ్బంది పాల్గొంటున్నారని జిల్లా విద్యుత్ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఒంగోలు విద్యుత్ భవన్ నుండి 125 కేవీ గల రెండు జనరేటర్లను బుధవారం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, 120 మంది సిబ్బంది, 100 హాలోజన్ బల్బులు పంపించామని, మరో 50 మంది సిబ్బందిని పంపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్