బాబుకు ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది మొర

607చూసినవారు
బాబుకు ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది మొర
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న తమను తొలగించవద్దంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొత్తగా కొలువు తీరనున్న టిడిపి కూటమి ప్రభుత్వానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు వినతి పత్రం పంపారు. ఈ సందర్భంగా పర్చూరులో బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ 12 వేల మంది నోటి వద్ద కూడు తీయవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్