అంకమ్మ దేవరతో సముద్రుడికి మొక్కులు

63చూసినవారు
అంకమ్మ దేవరతో సముద్రుడికి మొక్కులు
సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామంలో బొల్లినీడి వంశస్థుల ఇంటి దేవర అయిన అంకమ్మకు 150 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్న సముద్రుడి మొక్కుల ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామం నుంచి ఆ వంశస్థులు, వారి బంధువులు సుమారు 200 మంది కొత్తపట్నానికి మేళతాళాలతో వచ్చారు. పొంగళ్లతో సముద్రుడికి నైవేథ్యం పెట్టారు. వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సుఖశాంతులతో జీవించాలని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్