50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

69చూసినవారు
50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు
మద్దిపాడు మండలంలోని రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేయనున్నట్లు వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తొలకరిలో పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో కలిపితే భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్