పేదలకు పట్డెడు బువ్వ పెట్టే ‘అన్న క్యాంటీన్లు’ తిరిగి తెరుచుకుంటున్నాయి. వైసీపీ పాలనలో కనుమరుగైన రూ. ఐదుకే భోజనం పెట్టిన క్యాంటీన్లు ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాంటీన్ల పునరుద్ధరణకు చకచకా సన్నాహాలు పూర్తిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను గురువారం, పంద్రాగస్టు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభిస్తారు.