ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డికి సంబంధించిన మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆయన హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ సంస్థకు చెందిన రూ.151 కోట్లకు ఎలాంటి బిల్లులు కనిపించడం లేదు. ఆ మొత్తాన్ని ఎందుకు చెల్లించారనే సమాచారమూ దొరకడం లేదు. సాధారణంగా సంస్థ నుంచి ఒక్క రూపాయి చెల్లించాలన్నా.. నిర్ణీత విధానం ఉంటుంది. ఆ చెల్లింపు దస్త్రంపై సంబంధిత అధికారులు సంతకాలు చేయాలి. ఇవేమీ లేకుండానే సంస్థ మాజీ ఎండీ వ్యవహరించినట్లు తెలిసింది.